శాతకర్ణి సెన్సార్ పూర్తి

Friday,January 06,2017 - 11:05 by Z_CLU

బాలయ్య నటించిన ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాను చూసి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ పూర్తవ్వడంతో.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదలకు అధికారికంగా లైన్ క్లియర్ అయినట్టయింది. క్రిష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రియ, హేమమాలిని కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గౌతమీపుత్ర శాతకర్ణి థియేటర్లలోకి రానుంది.

gps

సినిమాకు అఫీషియల్ గా ప్రచారం ప్రారంభించే ముందు, పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి వంద థియేటర్లలో శాతవాహన పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. విశాఖలో జరిగే కార్యక్రమంలో బాలయ్య పాల్గొంటారు. పతాకావిష్కరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన తర్వాత, సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.