50 డేస్ పూర్తి చేసుకున్న గౌతమీపుత్ర శాతకర్ణీ

Thursday,March 02,2017 - 09:02 by Z_CLU

సంక్రాంతి పండక్కి హిస్టారికల్ కంటెంట్ తో రిలీజైంది గౌతమీపుత్ర శాతకర్ణీ. బాలయ్య 100 వ సినిమా కావడంతో సినిమా అనౌన్స్ కూడా కాకముందే ఆ స్పేస్ లో హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అలాంటి టైం లో క్రిష్, హిస్టారికల్ స్టోరీతో బాలయ్యని సంప్రదించడం, సినిమాకి గ్రీన్ సిగ్నల్ దొరకడం అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోయింది.

గౌతమీపుత్ర శాతకర్ణీ అనౌన్స్ అయింది మొదలు, ప్రతి మూమెంట్ ని ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసినట్టు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గౌతమీపుత్రుని క్యారెక్టర్ లో బాలయ్య విశ్వరూపం ప్రతి ఒక్కరి చేత భళా అనిపించుకుంది.

 

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం డైరెక్టర్ క్రిష్ సరికొత్త లొకేషన్స్ ని ఎంచుకోవడం దగ్గరి నుండి కాస్ట్యూమ్స్ వరకు చాలా రీసర్చ్ చేసి మరీ ప్లాన్ చేసుకున్నాడు. బాలయ్యని రొటీన్ రాజులా కాకుండా, యూనిక్ గా ప్రెజెంట్ చేయడంలోను సక్సెస్ అయ్యాడు. శ్రియా శరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హేమా మాలిని బాలయ్య తల్లి పాత్రలో 100% ఆప్ట్ అనిపించుకుంది. రిలీజైన ప్రతి సెంటర్ లో ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ ని బ్యాగ్ లో వేసుకున్న గౌతమీపుత్ర శాతకర్ణీ ఈ రోజు 50 డేస్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.