గౌతమీపుత్ర శాతకర్ణీ క్లైమాక్స్ అది కాదు

Friday,November 04,2016 - 12:04 by Z_CLU

రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్దీ బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణీపై కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. శాతకర్ణీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ఆ రాజులాగే వీర మరణం పొందుతాడా..? చివరికి శతృవులతో పోరాడుతూ మరణిస్తాడా..? అసలు క్రిష్ ఈ సినిమా క్లైమాక్స్ ని ఎలా ప్లాన్ చేస్తున్నాడు..? ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చేశాడు క్రిష్.

   గౌతమీ పుత్ర శాతకర్ణీ సినిమా శాతకర్ణీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమానే అయినా, ఇది కంప్లీట్ బయోపిక్ కాదని, ఆయన జీవితంలోని కొన్ని అతి ముఖ్యమైన ఎలిమెంట్స్ పై మాత్రమే సినిమా ఉంటుందని తేల్చేశాడు క్రిష్.