నవంబర్ 3న 'PSV గరుడ వేగ' రిలీజ్

Monday,October 09,2017 - 11:04 by Z_CLU

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా గరుడ వేగ విడుదలకు సిద్ధమైంది. పూజా కుమార్ హీరోయిన్ గా, సన్నీలియోన్ ఐటెంసాంగ్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. ఇంకా చెప్పాలంటే రాజశేఖర్ కెరీర్ లో మాత్రమే కాదు.. టాలీవుడ్ చరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది గరుడవేగ. ఈ సినిమాను వచ్చేనెల 3న విడుదల చేయాలని నిర్ణయించారు.

గుంటూరు టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకుడు. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు. మరీ ముఖ్యంగా జార్జియాలో 33 రోజుల పాటు తీసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫస్ట్ లుక్స్, టీజర్స్, మేకింగ్ వీడియోస్ విడుదలయ్యాయి. త్వరలోనే ఆడియో ఫంక్షన్ జరపనున్నారు.

ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం అందిస్తే భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. శ్రద్ధా దాస్, కిషోర్, నాజర్, పోసాని కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు కోటేశ్వర రాజు నిర్మాత.