గ్యాంగ్ లీడర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,September 16,2019 - 11:49 by Z_CLU

నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఫస్ట్ వీకెండ్ లో తన స్టామినా చూపించింది. ఓ వైపు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా మాత్రం మొదటి వారాంతం మెరిసింది. ఒకట్రెండు ఏరియాలు మినహా, మిగతా ఏరియాలన్నీ బ్రేక్-ఈవెన్స్ కు దగ్గరయ్యాయంటే నాని మార్కెట్ స్టామినాను అర్థంచేసుకోవచ్చు.

ఇక వీకెండ్ కలెక్షన్ విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 11 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఏపీ, నైజాం కలిపి ఈ సినిమాను 21 కోట్ల రూపాయలకు అమ్మారు. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా హాఫ్-మిలియన్ మార్క్ దాటేసి, మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లేందుకు దూసుకుపోతోంది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు 7 లక్షల 25వేల డాలర్లు వచ్చాయి.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 4.67 కోట్లు
సీడెడ్ – రూ. 1.43 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.57 కోట్లు
ఈస్ట్ – రూ. 1.06 కోట్లు
వెస్ట్ – రూ. 0.64 కోట్లు
గుంటూరు – రూ. 1.04 కోట్లు
నెల్లూరు – రూ. 0.35 కోట్లు
కృష్ణా – రూ. 0.94 కోట్లు