గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే కలెక్షన్

Saturday,September 14,2019 - 01:38 by Z_CLU

నాని-విక్రమ్ కుమార్ కాంబోలో రివెంజ్ కామెడీ డ్రామాగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా మొదటి రోజు డీసెంట్ వసూళ్లు రాబట్టింది. సాహో తర్వాత బిగ్ రిలీజ్ గా వచ్చిన ఈ సినిమాకు ఫస్ట్ డే ఏపీ, నైజాంలో 4 కోట్ల 55 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 28 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా లక్షా 87వేల డాలర్లు ఆర్జించిన ఈ సినిమా.. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు 3 లక్షల 17 వేల డాలర్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో నానికి ఇది రెండో బిగ్గెస్ట్ ఓపెనర్. ఎంసీఏ ఫస్ట్ డే కలెక్షన్ (ప్రీమియర్స్ తో కలుపుకొని 4 లక్షల 22వేల డాలర్లు) ను మాత్రం గ్యాంగ్ లీడర్ క్రాస్ చేయలేకపోయింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 1.67 కోట్లు
సీడెడ్ – రూ. 0.51 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.61 కోట్లు
ఈస్ట్ – రూ. 0.52 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
గుంటూరు – రూ. 0.46 కోట్లు
నెల్లూరు – రూ. 0.15 కోట్లు
కృష్ణా – రూ. 0.33 కోట్లు