గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,September 23,2019 - 01:45 by Z_CLU

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్/వాల్మీకి ఫస్ట్ వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటిరోజు వసూళ్లలో వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ గా నిలిచిన ఈ సినిమా… వీకెండ్ కలెక్షన్స్ తో 50 శాతం రికవర్ అయింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

సినిమాకు భారీగా చేసిన ప్రచారం కలిసొచ్చింది. సినిమాపై వచ్చిన వివాదాలు కూడా ప్రచారానికి కలిసొచ్చాయి. అలా భారీ హైప్ మధ్య రావడం గద్దలకొండ గణేష్ కు ప్లస్ అయింది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా రన్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 4.69 కోట్లు
సీడెడ్ – రూ. 2.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.63 కోట్లు
ఈస్ట్ – రూ. 1.05 కోట్లు
వెస్ట్ – రూ. 0.96 కోట్లు
గుంటూరు – రూ. 1.20 కోట్లు
నెల్లూరు – రూ. 0.55 కోట్లు
కృష్ణా – రూ. 1.07 కోట్లు