గద్దలకొండ గణేష్ ఫస్ట్ డే కలెక్షన్

Saturday,September 21,2019 - 12:38 by Z_CLU

మొదటి రోజు గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకి సూపర్ హిట్ అయింది. హరీష్ శంకర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది.

14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో మెప్పించాడు వరుణ్ తేజ్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన పూజా హెగ్డే సినిమాకు మరో హైలెట్ కాగా.. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మిక్కీ జే మేయర్ కూడా హైలెట్ గా నిలిచాడు.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్
నైజాం – రూ. 1.60 కోట్లు
సీడెడ్ – రూ. 0.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.60 కోట్లు
ఈస్ట్ – రూ. 0.50 కోట్లు
వెస్ట్ – రూ. 0.50 కోట్లు
గుంటూరు – రూ. 0.45 కోట్లు
నెల్లూరు – రూ. 0.15 కోట్లు
కృష్ణా – రూ. 0.30 కోట్లు