వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్న GA2 టీం

Sunday,March 29,2020 - 12:54 by Z_CLU

మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మాత‌గా జీఏ 2 పిక్చ‌ర్స్ – సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల పై యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్ న‌టిస్తున్న సినిమా 18 పేజ‌స్. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీప్లే అందిస్తున్నాడు. ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు.

ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం కరోనా వల్ల సినిమా షూటింగ్ ఆగింది. క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 21 రోజుల లాక్ డౌన్ కి 18 పేజీస్ చిత్ర బృందం సంపూర్ణ మ‌ద్ద‌త్తు తెలుపుతూనే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ని వీడియో కాల్ ద్వారా చేస్తున్నారు.

ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్, సంగీత ద‌ర్శ‌కుడు గోపీ సుంద‌ర్ ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారు.