G. నాగేశ్వర రెడ్డి ఇంటర్వ్యూ...

Monday,January 22,2018 - 06:00 by Z_CLU

మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ ఈ నెల 26 న రిలీజ్ కానుంది. అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ G. నాగేశ్వర రెడ్డి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీ కోసం….

అదే ఆచారి అమెరికా యాత్ర…

తాత సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ఒక తాత మనవరాలి కి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఒక బ్రాహ్మణ బృందం ఎలా కాపాడింది అనేదే ఈ సినిమా. ఒకమంచి కథకి కావాల్సినంత వినోదాన్ని జోడించి తెరకెక్కించిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’.

 

దాసరి గారు రాసుకున్న క్యారెక్టర్…

కొన్నేళ్ళ క్రితం దాసరి గారు అయన ఊళ్ళో ఒక ఆచారి గారిని రిఫరెన్స్ తీసుకుని ఒక క్యారెక్టర్స్ రాసుకున్నారు. ఇప్పుడు మల్లాది గారు ఆ క్యారెక్టర్ చుట్టూ అందమైన స్టోరీ రాసుకున్నారు. చౌదరి గారు ఆ కథ విని బావుందని చెప్పడం, నేను వినడం.. బావుందనిపించడంతో సినిమా సెట్స్ పైకి వచ్చింది.

డిస్కర్షన్స్ జరగలేదు…

కథ అనుకున్నప్పుడే విష్ణు, బ్రహ్మానందం అని ఫిక్సయ్యాం. ప్రొడ్యూసర్స్ చాయిస్ కూడా అదే, నా చాయిస్ కూడా అదే. కనీసం ఈ విషయంలో డిస్కర్షన్స్ కూడా జరగలేదు. ఈ ఇద్దరిలో ఒక్కరు లేకపోయినా సినిమా ఉండేది కాదు… ఈ రెండు క్యారెక్టర్స్ మాత్రమే కాదు, సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ చివరికి సినిమా చివర్లో వచ్చే పృథ్వీ…  తన వైఫ్ గీతా సింగ్, కొడుకు భరత్ వరకు ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కి తగ్గట్టు సరిగ్గా కుదిరారు.

అది మా కెమిస్ట్రీ కాదు…

అందరూ నాకు విష్ణుకి మంచి కెమిస్ట్రీ కుదురుతుంది అంటారు. కానీ నిజానికి నాకు కామెడీకి మంచి కెమిస్ట్రీ కుదురుతుంది. అదే విధంగా విష్ణుకి, కామెడీకి కూడా అదే రేంజ్ కెమిస్ట్రీ కుదురుతుంది. నాకు తెలిసి నేను కామెడీ పండించగల ఏ హీరోతో అయినా నేను కంఫర్టబుల్ గా ఉంటాను….

బ్రహ్మానందం గారు పెద్ద ఎసెట్….

సినిమాలో బ్రహ్మానందం గారిది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఒక సినిమాలో అందరూ ఉండి ఆయన లేకపోతే బ్రహ్మానందం లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాంటిది ఈ సినిమాలో ఆయన ఫుల్ లెంగ్త్ కామెడీతో అలరిస్తారు. సినిమాకి ఆయన ఎసెట్.

 

కామెడీ లేకుండా సినిమా ఉండదు…

సినిమా పుట్టినప్పటి నుండి కామెడీ ఉంది. కాకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిన తరవాత ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు వచ్చాయి. ఆయన తరవాత అల్లరి నరేష్ ఇప్పటికీ ఆ పరంపర కొనసాగిస్తున్నాడు. ఇండస్ట్రీలో లవర్ బాయ్స్ ఎక్కువగా ఉండటం చేత డైరెక్టర్స్ ఆ స్టోరీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కామెడీ హీరోలు ఉంటే ఆబ్వియస్ గా కామెడీ సినిమాలు చేస్తారు…

కామెడీ సినిమాలు తగ్గడానికి రీజన్…

యంగ్ డైరెక్టర్స్ ఎక్కువగా లవ్ స్టోరీస్, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తారు. కామెడీ కథ రాసుకోవాలన్నా అంతే కష్టపడాలి, లవ్ ఎంటర్ టైనర్ రాసుకోవాలన్న అంతే కష్టపడాలి. కాకపోతే కామెడీ ఎంటర్టైనర్ కి తక్కువ పే చేస్తారు. అందుకే ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేయరు…

గర్వంగా ఫీలవుతున్నా…

అందరూ నన్ను కామెడీ సినిమా డైరెక్టర్ గా గుర్తిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇలాగే కొనసాగుతాను…

 

నెక్స్ట్ సినిమాలు…

నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ గా విష్ణు తోనే ఉంటుంది. రీసెంట్ గా ఆయనకు కథ చెప్పడం, ఆయనకు నచ్చడం జరిగింది. అందుకే లేట్ చేయకుండా ఇమ్మీడియట్ గా చేసేద్దామనుకుంటున్నాం…

స్టార్ హీరోతో కూడా చేయొచ్చు…

చిరంజీవి గారి కన్నా పెద్ద స్టార్ లేరు ఇండస్ట్రీలో. అలాంటిది ఆయనే కామెడీ చేశారు. అలాంటప్పుడు నేను కామెడీ సినిమాలే తీస్తాను అని కమిట్ అయ్యాను అంటే స్టార్ హీరోతో తీయను అని కాదు. స్టార్ హీరోలతో చేయాలంటే టైమ్ రావాలి. వచ్చినప్పుడు అదే జరిగిపోతుంది.