బాహుబలి 2 థియేటర్ లో ఫన్నీ ఇన్సిడెంట్

Friday,April 28,2017 - 06:32 by Z_CLU

వరల్డ్ వైడ్ గా ప్రభంజనం సృష్టిస్తుంది బాహుబలి 2. గురువారం రాత్రి నుండే ప్రీమియర్ షోస్ తో బిగిన్ అయిన సందడి, పాజిటివ్ రివ్యూస్ తో ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ తో వీధి వీధి మారు మోగుతుంది. అయితే బెంగళూరు లో బాహుబలి 2 ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ లో ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

బాహుబలి 2 సినిమా అంటే జస్ట్ బాహుబలి ఫ్యాన్స్ కే కాదు. థియేటర్స్ మ్యానేజ్ మెంట్ దగ్గరి నుండి ఆపరేటర్ వరకు అదే ఎగ్జైట్ మెంట్ ఉంది. అయితే అదే ఎగ్జైట్ మెంట్ లో ఓ థియేటర్ లో ఆపరేటర్ ఫస్ట్ హాఫ్ ప్లే చేయడానికి బదులు సెకండ్ ఆఫ్ ప్లే చేసేశాడు.

సెకండాఫ్ చూస్తున్నంత సేపు ఏ మాత్రం సౌండ్ లేకుండా సినిమా ఎంజాయ్ చేసిన జనం, తీరా క్లైమాక్స్ దగ్గర పడేసరికి ఫస్టాఫ్ ప్లే చేయలేదు కాబట్టి, మళ్ళీ మొత్తం సినిమా ప్లే చేయాల్సిందే అని పట్టు బట్టారట. థియేటర్ యాజమాన్యం చేసేదేమీ లేక మళ్ళీ మొత్తం సినిమా ప్లే చేశారట. థియేటర్ యాజమాన్యానికి కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా, ఫ్యాన్స్ కి మాత్రం మెమోరబుల్ మూమెంట్ ని మిగిల్చింది బాహుబలి 2.