Shruti Hassan - సరదా ప్రశ్నలు

Saturday,September 12,2020 - 07:12 by Z_CLU

– కనిపించకుండా ఉండడం.. ఎగిరిపోవడం.. వీటిలో ఏదిష్టం?
ఎప్పుడైనా ఎగిరిపోవాలనే కోరుకుంటాను

– ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేని వ్యక్తుల్ని చూస్తే ఏమనిపిస్తుంది?
అయ్యో పాపం అనిపిస్తుంది

– ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను తిట్టడం ఇష్టమా.. లవర్ ను తిట్టడం ఇష్టమా?
దీనికి నా దగ్గర సమాధానం లేదు

– చేయి లేదా కాలులో ఏది లేకుండా ఉండగలవు?
దేవుడా.. నాకు రెండూ కావాలి

– క్రియేట్ హిస్టరీ, డిలీట్ హిస్టరీలో ఏదిష్టం?
హిస్టరీ క్రియేట్ చేయడమే ఇష్టం. మొబైల్ లో హిస్టరీ డిలీట్ చేయడం ఇష్టం

– కంట్రోల్ చేసే ఛాన్స్ వస్తే మనుషుల్ని కంట్రోల్ చేస్తావా టైమ్ ను కంట్రోల్ చేస్తావా?
టైమ్ ను కంట్రోల్ చేస్తా.. నిజంగా ఆ ఛాన్స్ వస్తే బాగుంటుంది కదా

– స్పేస్ లో ఉండడం ఇష్టమా.. నీటి అడుగున ఉండడం ఇష్టమా?
నీటి అడుగున ఉండడానికే ఇష్టపడతాను.