రానా ఘాజి సెట్స్ లో ఫ్రస్టేషన్

Tuesday,January 31,2017 - 07:08 by Z_CLU

రానా ఘాజి ఫిబ్రవరి 17 న రిలీజ్ కానుంది. ఈ లోపు ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు రానా. ఈ సినిమాలో నేవీ ఆఫీసర్ గా కనిపిస్తున్న రానా, హిస్టారికల్ అండర్ వాటర్ వార్ టైం లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని రెఫరెన్స్ గా తీసుకుని తెరకెక్కించారు.

ప్రమోషన్ లో భాగంగా షూటింగ్ టైం లో తన ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేసుకున్న రానా, చాలాకాలం సబ్ మెరీన్ సెట్ లోనే షూటింగ్ చేయాల్సి రావడంతో, ఒకానొక టైం లో టీం మొత్తం ఫ్రస్టేట్ అయిపోయిందట. దాంతో ఎలాగోలా  అవుట్ డోర్ షూటింగ్ ని ప్లాన్ చేసిందట సినిమా యూనిట్.

ghazi-press-movie-press-meet-zee-cinemalu

సంకల్ప్ రెడ్డి తానే స్వయంగా రాసుకున్న నవల ఆధారంగా, ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటిస్తుంది.