ఫ్రైడే రిలీజ్ - ఒకేరోజు రిలీజవుతున్న 9 సినిమాలు

Tuesday,June 26,2018 - 06:25 by Z_CLU

లాస్ట్ వీక్ రిలీజైన 4 సినిమాలు సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్నాయి. అయితే  ఈ  వారం  పెద్ద సినిమాల  రిలీజెస్  లేకపోవడంతో  ఏకంగా  9 సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. వాటి  వివరాలివే…

 

కన్నుల్లో నీ రూపమే : నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటించిన యూత్ ఫుల్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ ఈ సినిమా. ఈ సినిమాతో బిక్స్ ఇరుసాడ్ల డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ తో ఇంప్రెస్ చేసిన ఫిల్మ్ మేకర్స్, బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాలి…

 

ఈ నగరానికి ఏమైంది..?:  ‘పెళ్ళి చూపులు’ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ రెండో సినిమా ఇది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా చుట్టూ  రిలీజ్  కి ముందే  పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయి ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

 

శంభో శంకర : కమెడియన్ షకలక శంకర్ ఫుల్ లెంగ్త్  హీరోగా చేసిన సినిమా శంభో శంకర. శ్రీధర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో షకలక శంకర్ కామెడీ చేస్తూనే, యాక్షన్ హీరోగా ఇంప్రెస్ చేయనున్నట్టు  తెలుస్తుంది. ఈ ఫ్రై డే గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా, ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.

యుద్ధభూమి : 1971 లో భారత సరిహద్దుల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కింది అల్లు శిరీష్ ‘యుద్ధభూమి’. లాస్ట్ ఇయర్ మలయాళంలో రిలీజై సూపర్ హిట్టయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో గ్రాండ్ గా రిలీజవుతుంది.  మేజర్ రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.

 

 

సంజీవని : ట్రైలర్ ని బట్టి ఇంటెన్సివ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. భారీ VFX తో తెరకెక్కిన ఈ సినిమాలో అనురాగ్ దేవ్, మనోజ్ చంద్ర మరియు శ్వేత వర్మ హీరోయిన్స్ గా నటించారు. ఈ ఫ్రైడే రిలీజవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో  ఇంప్రెస్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకి రవి డైరెక్టర్.

 

నా లవ్ స్టోరీ : మహిధర్, సోనాక్షి జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ నా లవ్ స్టోరీ. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి వేదం నివాస్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. శివ గంగాధర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి లక్ష్మి ప్రొడ్యూసర్.

సూపర్ స్కెచ్ : మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ‘సూపర్ స్కెచ్’. గతంలో ‘సామాన్యుడు’, ‘శ్రీమన్నారాయణ’ సినిమాలకు దర్శకత్వం వహించిన కమర్షియల్ డైరెక్టర్ రవి చావలి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.   నర్సింగ్, ఇంద్ర, అనిక ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తారు.

IPC సెక్షన్ భార్యబంధు :  ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ని బేస్ చేసుకుని తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘IPC సెక్షన్ భార్యబంధు’. ‘సేవ్ మెన్ ఫ్రమ్ విమెన్’ అనే డిఫెరెంట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే రిలీజవుతుంది. శరత్ చంద్ర, నేహా దేశ్ పాండే జంటగా నటించిన ఈ సినిమాలో ఆమని కీ రోల్ ప్లే చేసింది.

మిస్టర్ హోమానంద్ : ఓం తీర్థాన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘హోమానంద్’. జై రామ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుందో ఈ ఫ్రైడే తెలుస్తుంది. హోమానంద్, పావని, ప్రియాంక ఈ సినిమాలో హీరో హీరోయిన్స్.