వీకెండ్ రిలీజ్

Thursday,January 12,2017 - 11:00 by Z_CLU

ఓ వైపు సంక్రాంతి ఫీవర్ తో మరో వైపు ఫుల్లీ లోడెడ్ రెడీ ఫర్ రిలీజ్ మూవీస్ తో బాక్సాఫీస్ భారీ ఓపెనింగ్స్ తో ఫిల్ అవ్వడానికి రెడీ అయింది.

shatamanam-bhavathi

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ నటించిన శతమానం భవతి సరిగ్గా సంక్రాంతి రోజున, అంటే ఈ శనివారం రిలీజవుతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఆల్ రెడీ హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ని బ్యాగ్ లో వేసుకుంది. సంక్రాంతి సీజన్ కి రెడీ అయిన ఫ్యామిలీ సినిమా కావడంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. సతీష్ వేగేశ్న డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.

head-constable-venkatramaiah-zee-cinemalu

రివెల్యూషనరీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ R. నారాయణ మూర్తి నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ కూడా ఈ వీకెండ్ రిలీజ్ కానుంది. నారాయణ మూర్తి స్ట్రిక్ట్ పోలీస్ కానిస్టేబుల్ గా నటించిన ఈ సినిమాలో జయసుధ ఫీమేల్ లీడ్ గా నటించింది. నారాయణ మూర్తి గత సినిమాల్లోలా కాకుండా, కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో మెసేజ్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమాకి చదలవాడ శ్రీనివాసరావు నిర్మాత.

xxx-thereturn-of-xander-cage

ఈ సంక్రాంతికి జస్ట్ టాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హంగామా చేయనుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పాడుకోన్, విన్ డీజిల్, నటించిన XXX నిజానికి జనవరి 17 న రిలీజ్ కి ఫిక్సయిన ఈ సినిమా, ఇండియాలో మాత్రం సంక్రాంతి నుండే సందడి చేయనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. విదేశాల్లో కంటే ముందు భారత్ లో ఈ మూవీ సందడి చేయబోతుండడం విశేషం.