శుక్రవారం విడుదల

Thursday,December 15,2016 - 01:17 by Z_CLU

nnn-759

హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ రేపు రిలీజ్ అవుతోంది. కుమారి 21-ఎఫ్, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, వాడో రకం-వీడో రకం సినిమాలతో హిట్స్ కొట్టిన హెబ్బా పటేల్ ఇందులో హీరోయిన్ గా నటించింది కాబట్టి.. మూవీపై కూసింత బజ్ క్రియేట్ అయింది. భాస్కర్ బండి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ తో పాటు… రావు రమేష్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్, కృష్ణ భగవాన్, సన తదితరులు నటించారు.

meelo-evaru-koteeswarudu

 

నవీన్ చంద్ర, హీరోగా తెరకెక్కిన మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా కూడా రేపే థియేటర్లలోకి వస్తోంది. నవీన్ చంద్ర హీరోనే అయినప్పటికీ… స్టోరీ మొత్తం ఫృధ్వి, సలోనీ చుట్టూ తిరుగుతుంది. ఫృధ్వి కామెడీ, సలోనీ అందాలు సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్ అంటున్నారు మేకర్స్. వీళ్లతో పాటు పోసాని, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు కామెడీ కూడా బోనస్ అంటున్నారు. ఈ.సత్తిబాబు డైరక్ట్ చేసిన ఈ సినిమాకు K.K. రాధామోహన్ నిర్మాత.

chinnari-telugu-movie-priyanka

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర నటించిన హారర్ థ్రిల్లర్ రేపు రిలీజవుతుంది. లోహిత్ H డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లోనూ ఒకే రోజు విడుదల చేస్తున్నారు.

ameerpet-lo

పద్మశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అమీర్ పేటలో’ మూవీ రేపు రిలీజవుతుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా మోనికతో పాటు.. మరికొంతమంది నటీనటులు టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

janaki-ramudu

తమ్మినేది  సతీష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన జానకి రాముడు ఈ ఫ్రై డే కి రిలీజవుతుంది. MC నాయుడు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లో నవీన్ సంజయ్, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటించారు.

hate-story-3

ఇక బాలీవుడ్ లో కూడా ఈ వీకెండ్ హంగామా బాగానే ఉంది. విశాల్ పాండ్య డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘వజాహ్ తుమ్ హో’. సనా ఖాన్, శర్మాన్ జోషి, గుర్ మీత్ చౌదరి నటించిన ఈ సినిమా వీకెండ్ ఎట్రాక్షన్ గా దేశవ్యాప్తంగా విడుదలకాబోతోంది.