ఫ్రైడే రిలీజ్

Wednesday,December 28,2016 - 01:30 by Z_CLU

allari-naresh-intlo-dayyam-nakem-bhayyam-zee-cinemalu

అల్లరి నరేష్ హీరోగా G. నాగేశ్వర రెడ్డి దిరేక్షన్ లో తెరకెక్కిన ‘ఇంట్లో దెయ్యం నాకేం బయ్యం’ ఈ ఫిడే రిలీజ్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ సినిమాలో కృతిక జయకుమార్ హీరోయిన్ గా నటించింది. రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, చలపతి రావు, శకలక శంకర్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాని B.V.S.N ప్రసాద్ నిర్మించాడు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

appatlo-okadundevadu-zee-cinemalu

నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన అప్పతో ఒకడుండేవాడు కూడా ఈ ఫ్రై డే బరిలోకి దిగుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన తానియా హీరోయిన్ గా నటించింది. శ్రీ విష్ణు మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశాడు. సాగర్ K చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని ప్రశాంతి & కృష్ణ విజయ్ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

karam-dosa-zee-cinemalu

గాజులపల్లి త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ కారందోశ. శివకుమార్, సూర్య శ్రీనివాస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన ఈ సినిమాని వీణ వేదిక బ్యానర్ పై తెరకెక్కింది. సిద్ధార్థ్ వాట్ కిన్స్ సంగీతం అందించాడు.

plus-1-zee-cinemalu

అళహరి డైరెక్షన్ లో రోషన్, ఆర్తి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ప్లస్ వన్. అల్లరి చిల్లరగా తిరిగే యువకులు సడెన్ గా ఒక సమస్య ఎదురవ్వగానే ఏం చేశారు..? అనే ప్రధానా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాని విశ్వాస్ H. నిర్మించాడు. జయసూర్య సంగీతం అందించాడు.

nenosta-zee-cinemalu

పరంద్ కళ్యాణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘నేనొస్తా’ ఈ ఫిడే రిలీజ్ కి ఆల్ సెట్ అయింది. జ్ఞాన్ ప్రకాశ్, సూర్య శ్రీనివాస్, ప్రియాంక పల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. బాషా మజహర్ నిర్మించిన ఈ సినిమా పర్ ఫెక్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.