ఫ్రైడే రిలీజ్

Wednesday,November 20,2019 - 01:22 by Z_CLU

ఈ వారం ఏకంగా 7 సినిమాలు రిలీజవుతున్నాయి. జోనర్ వైజ్ గా కంపేర్ చేసుకున్నా దేనికదే స్పెషల్… బాక్సాఫీస్ దగ్గర ఏది స్ట్రాంగ్ గా నిలబడుతుందనేది ఫ్రైడే రోజు ఎలాగూ తెలిసిపోతుంది కానీ ఈ లోపు ఈ సినిమాల డీటేల్స్ ఇవే…

రాజా నరసింహా : మమ్ముట్టి హీరోగా నటించిన సినిమా. ఈ వీకెండ్ రిలీజ్ కి ఉన్న సినిమాల్లో భారీ కమర్షియల్ వ్యాల్యూస్ తెరకెక్కిన సినిమా ఇదొకటే. మలయాళంలో ఇప్పటికే రికార్డులు బ్రేక్ చేసింది. దానికి తోడు గతంలో సక్సెస్ అయిన ‘మన్యంపులి’ దర్శకుడు వైశాఖ్ ఈ సినిమాకు డైరెక్టర్. ఈ పాయింట్ కూడా టాలీవుడ్ ఆడియెన్స్ లో సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తుంది.

రాగల 24 గంటల్లో :  ఈషా రెబ్బ, సత్యదేవ్ జంటగా నటించారు. ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ అని తెలుస్తుంది. సత్యదేవ్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్ గా చెప్పడం ఇప్పుడే కుదరదు కానీ, ఈషా రెబ్బకి మాత్రం పర్ఫామెన్స్ కి ఓ స్థాయిలో  స్కోప్ దొరికిన సినిమా. నటిగా ఈషా రెబ్బ హ్యాప్పీనే… కానీ ఓవరాల్ గా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయగలుగుతుందా..? లేదా..? చూడాలి.

జార్జ్ రెడ్డి : 1968 – 70 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బయోపిక్. స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలైతే క్రియేట్ చేస్తుంది. దానికి తోడు సెలెబ్రిటీస్ సినిమా ట్రైలర్ ని అభినందిస్తూ రెస్పాండ్ అవ్వడంతో, న్యాచురల్ గానే ఫోకస్ లోకి వచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే హిట్టయినట్టే.

తోలుబొమ్మలాట : ‘మనిషి జీవితమే ఓ తోలుబొమ్మలాట…’ అనే థీమ్ తో తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఇప్పటికే ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది. మరి థియేటర్స్ కి ఏ స్థాయిలో రప్పించగలుగుతుందో చూడాలి.

జాక్ పాట్ : జ్యోతిక్, రేవతి లీడ్ రోల్స్ ప్లే చేసిన సినిమా. ఫాంటసీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రమోషన్స్ విషయంలో అంతగా ఆక్టివ్ గా లేదనే చెప్పాలి. దాంతో బజ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో క్రియేట్ అవ్వలేదు… మరి సక్సెస్  అవుతుందా..?  చూడాలి.

ఈ సినిమాలతో పాటు మహేందర్ ఇప్పలపల్లి, కాత్యాయని శర్మ జంటగా నటించిన థ్రిల్లర్ ‘ట్రాప్’, చేతన్ మద్దినేని,తేజ రెడ్డి జంటగా నటించిన ‘బీచ్ రోడ్   చేతన్‘ కూడా ఈ వీకెండ్ రిలీజవుతున్నాయి.