ఫ్రైడే రిలీజ్

Wednesday,May 03,2017 - 12:40 by Z_CLU

మే 27 బాహుబలి ప్రీమియర్ షో నుండి బిగిన్ అయిన బాహుబలి 2 ఇంకా తగ్గనే లేదు. మరోవైపు మరిన్ని సినిమాలతో రెడీ అయిపోయింది బాక్సాఫీస్. హై ఎండ్ హీట్ జెనెరేట్ చేస్తున్న సమ్మర్ సీజన్ లో కూల్ బ్రీజ్ ని పట్టుకొస్తున్నాయి సరికొత్త సినిమాలు.

నవీన్ మేడారం డైరెక్షన్ లో అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ,, శ్రీముఖి నటించిన కామెడీ ఎంటర్ టైనర్ బాబు బాగా బిజీ. సెన్సార్ ఫార్మాలిటీస్ దగ్గర స్ట్రక్ అయి గతంలో రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 5 న రిలీజవుతుంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని అభిషేక్ నామా నిర్మించారు.

ఈ సినిమాతో కోలీవుడ్ లోను జీవ, సంగీత నటించిన ‘ఆరంభమే అట్టగాసం’, సముథిర ఖని, రాజాజీ, నైనా సర్వార్ నటించిన కొలాంజి, విక్రాంత్, అర్ధన బిను నటించిన తోండన్ తో పాటు కలైయారసన్ సాత్నా టైటస్ నటించిన ఏయిధవన్ కూడా రిలీజవుతుంది.