ఫ్రై డే రిలీజ్

Wednesday,March 08,2017 - 12:17 by Z_CLU

బాక్సాఫీస్ కొత్త సినిమాలతో రెడీ అవుతుంది. గత వారం రిలీజైన సినిమాల జోరు ఇంకా తగ్గనే లేదు. వాటికి  పోటీగా సరికొత్త ఎంటర్ టైనర్స్ బాసాఫీస్ దగ్గర స్పేస్ క్రియేట్ చేసుకున్నాయి. ఈ వారం రిలీజవుతున్న సినిమాలు ఇవే.

 

అంజలి లీడ్ రోల్ లో నటించిన చిత్రాంగద ఈ ఫ్రైడే రిలీజవుతుంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న చిత్రాంగద ఆశోక్ డైరెక్షన్ లో తెరకెక్కింది. హారిజోంటల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో మార్కాపురం శివకుమార్ రిలీజ్ చేస్తున్నారు. ఆల్ రెడీ హారర్ ఎంటర్ టైనర్స్ కి మంచిక్రేజ్ ఉన్న టైం లో రిలీజ్ అవుతున్న చిత్రాంగద ఫ్యాన్స్ లో ఇప్పటికే హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేసింది. మరి బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో నిలుస్తుందో చూడాలి.

 

రావ్ భీమన డైరెక్షన్ లో తెరకెక్కింది ఆకతాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆశిష్ రాజ్ – రుక్సార్ హీరో హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా, ఈ ఫ్రై డే రిలీజ్ కి రెడీ మోడ్ లో ఉంది.

 

సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ నగరం. రీసెంట్ గా రిలీజైన ట్రేలర్ చూస్తుంటే, మరీ రొటీన్ సినిమాలు కాకుండా డిఫెరెంట్ గా ఎంటర్ టైన్ చేయడమే ఎజెండాగా పెట్టుకున్న సందీప్ కిషన్ కరియర్ లో ఈ సినిమా డెఫ్ఫినేట్ గా స్పెషల్ ప్లేస్ ని ఆక్యుపై చేయడం గ్యారంటీ అనిపిస్తుంది. లోకేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది.

  

’16 – ఎవ్రీ డీటేయిల్ కౌంట్స్’ తెలుగులో ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు నరేన్ డైరెక్టర్. రెహ్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రేలర్ టాలీవుడ్ ని కూడా బాగానే ఇంప్రెస్  చేసింది. తమిళ నాట భారీ వసూళ్లతో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా, మరి టాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో ఈ ఫ్రైడే తెలిసిపోతుంది.