ఫ్రైడే రిలీజ్

Thursday,March 02,2017 - 12:50 by Z_CLU

అవుట్ అండ్ అవుట్ మాస్ ఎలిమెంట్స్ తో ఫన్ లోడెడ్ ఎంటర్ టైనర్స్ తో రెడీ అయిపోయింది టాలీవుడ్. ఎవ్రీ ఫ్రైడే లాగే సరికొత్త జోష్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ఈ ఫ్రై డే కూడా రిలీజ్ కి భారీ స్పేస్ ని ఆక్యుపై చేసుకున్నాయి సినిమాలు.

విజయ్ దేవరకొండ, పూజా జవేరి జంటగా తెరకెక్కింది ద్వారక. శ్రీనివాస్ రవీంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. విజయ్ దేవరకొండ దొంగ బాబా గెటప్ లో కనిపించనున్న ఈ సినిమా, ఇప్పటికే తెలుగు సినిమా ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ ని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘ద్వారక’  బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.

మంచు మనోజ్ గుంటూరోడు కూడా ఈ ఫ్రై డే నుండే థియేటర్స్ లో హల్ చల్ చేయబోతున్నాడు. S.K. సత్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. D.J. వసంత్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఇప్పటికే మనోజ్ కరియర్ లోనే హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలవడం ఖాయం అనే టాక్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది.

రాజ్ తరుణ్ కరియర్ లోనే డిఫెరెంట్ కాన్సెప్ట్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’. కుక్కల్ని కిడ్నాప్ చేసే వాడిలా డిఫెరెంట్ స్టోరీలైన్ తో ఈ ఫ్రైడే ‘రెడీ ఫర్ రిలీజ్’ అంటున్న రాజ్ తరుణ్ ఈ సినిమా పై ఫుల్లీ లోడెడ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వంశీ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కింది. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.