ఫ్రైడే రిలీజ్

Wednesday,December 21,2016 - 12:27 by Z_CLU

వెరైటీ సినిమాలతో ఈ వీకెండ్ కూడా ఫిక్సయిపోయింది. కామెడీ, క్రైం, యాక్షన్, యూత్ ఎంటర్ టైనర్స్ తో సినిమా స్ట్రీట్ సిద్ధమైపోయింది. డీమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా అటు ఫిలిం మేకర్స్, ఇటు ఫిలిం లవర్స్ మధ్య బ్యారియర్ కట్టలేకపోయింది. ఈ ఫ్రైడే కి సూపర్ హిట్ గ్యారంటీ అంటూ కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతున్నాయి కలర్ ఫుల్ ఎంటర్ టైనర్స్.

sapthagiri-express-release-date

కమెడియన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన సప్తగిరి ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. అరుణ్ పవార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ మ్యాగ్జిమం టాలీవుడ్ కమెడియన్స్ తో, కిరాక్ కామెడీ ఎలిమెంట్స్ రెడీ అయిపోయింది. ఈ సినిమాలో సప్తగిరి పోలీస్ కానిస్టేబుల్ గా నటించాడు.   

rgv-vangaveeti-release-date

రియల్ టైం క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన వంగవీటి కూడా ఈ ఫ్రైడే సినిమాలో వరసలో నిలబడింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండే కాన్సంట్రేషన్ మొత్తం తనవైపు తిప్పుకుంది. సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని రాము చెప్పుకోడు కానీ, ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఇప్పటికే సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

okkadochadu-release-date

డైనమిక్ స్టార్ విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ఒక్కడొచ్చాడు కూడా ఈ ఫ్రైడే కే ఫిక్సయింది. సూరజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించాడు. హెవీ యాక్షన్ ఎలిమెంట్స్ తో, థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఒక్కడొచ్చాడు ఈ ఫ్రైడే నుండి థియేటర్స్ లో దుమ్ము రేపడానికి రెడీ గా ఉంది.

pittagoda-release-date

KV అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన పిట్టగోడ కూడా ఆల్ రెడీ ఎడిటింగ్ రూమ్ కాంపౌండ్ వాల్ దాటి రిలీజ్ కి రెడీగా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రిలీజ్ అవుతున్న ఈ సినిమా సురేష్ బాబు గారి బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 24 న రిలీజ్ అవుతుంది. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘పిట్టగోడ’  సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.