ఫ్రైడే రిలీజ్

Wednesday,June 20,2018 - 01:42 by Z_CLU

లాస్ట్ వీక్ రిలీజైన ‘సమ్మోహనం’ సూపర్ హిట్టయింది. బాక్సాఫీజు దగ్గర భారీ కలెక్షన్స్ రికార్డ్ చేసుకుంటున్న ఈ సినిమాకి డిమాండ్ ఇంకా తగ్గనే లేదు. అప్పుడే మరో 4 సినిమాలు ఈ వారం రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వాటి వివరాలివే…

 

జంబలకిడి పంబ : శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా నటించిన ఈ సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. జస్ట్ టైటిల్ తోనే భారీ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఆ తరవాత రిలీజైన ట్రైలర్ తో మరిన్ని స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసింది. అల్టిమేట్ హిలేరియస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా, మరి థియేటర్స్ లో ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.

 

అతడే : దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘అతడే’ కంప్లీట్ గా డిఫెరెంట్ ఎంటర్ టైనర్. భూమి, నిప్పు, గాలి, నీరు… ఈ నాలుగు ఎలిమెంట్స్ చుట్టూ తిరిగే నలుగురు యంగ్ స్టర్స్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది ఈ సినిమా. దుల్కర్ సల్మాన్ ని 4 డిఫెరెంట్ క్యారెక్టర్స్   లో      ప్రెజెంట్ చేస్తున్న ‘అతడే’ , ఈ ఫ్రైడే తెలుగులో రిలీజవుతుంది.

 

దమ్ముంటే సొమ్మేరా : మలయాళంలో సూపర్ హిట్టయిన కామెడీ ఎంటర్ టైనర్ ‘దమ్ముంటే సొమ్మేరా’. సంతానం, ఆంచల్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమా ఈ ఫ్రైడే రిలీజవుతుంది.

 

టిక్…టిక్..టిక్..: జయం రవి హీరోగా నటించిన స్పేస్ థ్రిల్లర్ ‘టిక్..టిక్..టిక్..టిక్..’.  శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ, సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.