ఫ్రైడే రిలీజ్

Thursday,October 12,2017 - 03:02 by Z_CLU

బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీక్ రిలీజైన సినిమాల సందడి ఇంకా తగ్గనే లేదు అప్పుడే ఈ వీక్ కూడా కొత్త సినిమాలతో రెడీ అయిపోయింది. నాగార్జున  ‘రాజుగారి గది 2’ తో పాటు ‘గల్ఫ్’ ఈ వారం రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

రాజుగారి గది 2  : ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన హారర్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రాజుగారి గది 2. రేపు గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్ లో రిలీజ్ ఎప్పుడా అని ఎదురు చూసే రేంజ్ లో ఎట్రాక్ట్ చేసిందనే చెప్పాలి. సమంతా కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో నాగ్ మెంటలిస్ట్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ వసూళ్లు రాబట్టనుందో చూడాలి.

 

గల్ఫ్ : సునీల్ కుమార్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన గల్ఫ్ ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. గల్ఫ్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు పడుతున్న ఇబ్బందులే మెయిన్ ప్లాట్ గా, యూత్ ఫుల్  ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ సినిమాని యెక్కలి రవీంద్ర బాబు, M.S. రామ్ కుమార్ నిర్మించారు.