ఫ్రైడే రిలీజ్

Thursday,September 14,2017 - 05:48 by Z_CLU

లాస్ట్ వీక్ రిలీజైన సినిమాల హడావిడి ఇంకా తగ్గనే లేదు. అప్పుడే డిఫెరెంట్ డిఫెరెంట్ జోనర్స్ లలో కొత్త సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ రెడీ అయిపోయింది. వాటి వివరాలు ఇవే…

ఉంగరాల రాంబాబు

సునీల్ హీరోగా నటించిన ఉంగరాల రాంబాబు ఈ ఫ్రైడే రిలీజవుతుంది. రైతు సమస్యలు ప్రధానాంశంగా అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మియా జార్జ్ హీరోయిన్ గా నటించింది. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో నిలబడనుందో చూడాలి.

కథలో రాజకుమారి

నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’ కూడా ఈ ఫ్రైడే రిలీజవుతుంది. నమితా ప్రమోద్, నందితా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నాగశౌర్య స్పెషల్ రోల్ ప్లే చేశాడు. ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మహేష్ సూరపనేని డైరెక్టర్. డిఫెరెంట్ సినిమాలతో దూసుకెళ్తున్న నారా రోహిత్ కరియర్ కి ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వనుందో చూడాలి.

వీడెవడు

సచిన్, ఈశా గుప్తా జంటగా నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘వీడెవడు’. తాతినేని సత్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకి రైనా జోషి ప్రొడ్యూసర్.

సరసుడు

శింబు, నయనతార, ఆండ్రియా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సరసుడు’ తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన  ‘ఇదు నమ్మ ఆళు’ సినిమా ఇప్పుడు తెలుగులో ఫ్రైడే రోజున రిలీజవుతుంది. పాండిరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోను అంతే సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

శ్రీవల్లి

విజయేంద్ర వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ శ్రీవల్లి. రజత్, నేహ జంటగా నటించిన ఈ సినిమాని B.V.S.N. రాజ్ కుమార్ నిర్మించాడు. M.M. శ్రీలేఖ మ్యూజిక్ కంపోజర్.