ఫ్రైడే రిలీజ్

Wednesday,August 23,2017 - 10:02 by Z_CLU

గతవారం రిలీజైన సినిమాల హంగామా ఇంకా తగ్గనేలేదు అప్పుడే సరికొత్త సినిమాలతో రెడీ అయిపోయింది ఈ వారం బాక్సాఫీస్. యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో ఫుల్ టూ జోష్ ఫుల్ గా రెడీ అయిన ఈ వీకెండ్  రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే…

 

అర్జున్ రెడ్డి : విజయ్ దేవరకొండ, శాలిని జంటగా నటించిన అర్జున్ రెడ్డి ఈ ఫ్రైడే రిలీజవుతుంది. అల్టిమేట్ యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కింది. సెన్సేషనల్ టీజర్ తో రీసెంట్ గా ట్రేలర్ తో ఇంప్రెస్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకి రథన్ మ్యూజిక్ కంపోజర్.

 

వి. ఐ. పి. 2 : ధనుష్, అమలాపాల్, బాలీవుడ్ నటి కాజోల్ నటించిన వి. ఐ. పి. 2 ఈ ఫ్రైడే రిలీజవుతుంది. సూపర్ హిట్ సినిమా రఘువరన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండే పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. సౌందర్య రజినీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.

వివేకమ్ : అజిత్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన స్పై థ్రిల్లర్ వివేకమ్. శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే నుండి థియేటర్స్ లలో సందడి చేయనుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.