ఎన్.టి.ఆర్ కోసం తొలి సారిగా..

Saturday,August 20,2016 - 06:38 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల దర్శకత్వం లో నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. ప్రస్తుతం పాట చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఆడియో విడుదల నుండి ఈ చిత్రం లోని నేను లోకల్ అంటూ సాగే ఐటెం సాంగ్ ఒకటి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఐటెం సాంగ్ కు ముందుగా పలుగురు కథానాయికలను పరిశీలించిన యూనిట్ కాజల్ ను ఫైనల్ చేసి ప్రస్తుతం ఆ పాట ను కాజల్ పై భారీ సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కొరటాల రాసిన సంభాషణలు, ఎన్.టి.ఆర్-మోహన్ లాల్ నటనతో పాటు ఈ పాట కూడా హైలైట్ గా నిలుస్తుంయిందని గంటా పథం గా చెప్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఇప్పటి వరకూ అగ్ర కథానాయికగా వెలుగుతున్న కాజల్ తారక్ కోసం తొలి సారి గా ఈ చిత్రం లో ఐటెం భామ గా మారి అలరించబోతుంది. మరి ఈ ఐటెం సాంగ్ వెండి తెర పై ఎలా అలరిస్తుందో? చూడాలి.