Varudu Kaavalenu - తమన్ నుంచి మరో ఫోక్ సాంగ్

Wednesday,August 04,2021 - 12:24 by Z_CLU

‘వరుడు కావలెను‘ నుంచి ‘నాగ శౌర్య , రీతువర్మ’ ల ఫోక్ గీతం విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్

*  సూపర్ హిట్ స్వరాలు సమకూర్చిన  ప్రముఖ సంగీత దర్శకుడు తమన్

* ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్ ఆలపించిన మరో సుమధురమైన గీతం

*సంగీత, సాహిత్యాల కలబోత  ఈ లిరికల్ వీడియో

పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగశౌర్య, రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘

ఈరోజు ‘వరుడు కావలెను‘ చిత్రం యూనిట్ చిత్రం లోని ఓ గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే….
‘‘ నాగేటి సాలగాడ నాకేట్టి పనిరో
నాపగడ్డి సేలగాడ  నాకేట్టి పనిరో……‘‘ అనే సాహిత్యం తో సాగే ఈ గీతాన్ని గీత రచయిత అనంత శ్రీరామ్ రచించారు. ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్  వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు ప్రాణం పోశాయి. ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. సంగీతం, సాహిత్యం, నృత్యాలు  ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది.

– వరుడు కావలెను సాంగ్ కోసం క్లిక్ చేయండి

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ‘‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’ పాట బహుళ ప్రజాదరణ పొందింది. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు, వీడియోలు వంటి ప్రచారాలకు ప్రేక్షకాభిమానుల నుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది. ప్రస్తుతం చిత్రనిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.  ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు, నటీనటుల అభినయాలు చిత్రకథానుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

VaruduKavalenu-first-Lyrical-video-out_zeecinemalu

‘వరుడు కావలెను’ చిత్రంలో నాగశౌర్య-రీతువర్మ హీరోహీరోయిన్లు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, పమ్మి సాయి, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

nagashaurya ritu varma varudu kavalenu movie zeecinemalu 2

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్; ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశి

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics