స్పెషల్ మూవీస్ పై పెట్టిన ఫోకస్

Thursday,December 22,2016 - 03:30 by Z_CLU

ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తన కరియర్ లో స్పెషల్ మూవీస్ కి చేరువవుతున్నారు. విక్టరీ వెంకటేష్ గురు సినిమాకి ప్యాకప్ చెప్పి, రేపో మాపో మెల్లిగా అ సినిమా ప్రమోషన్స్ కి రెడీ అయిపోతాడు. మరోపక్క మురుగదాస్ సినిమాతో బిజీగా ఉన్న మహేష్ కూడా మ్యాగ్జిమం ఫిబ్రవరి ఎండింగ్ కు  ప్యాకప్ చెప్పేద్దామనే స్పీడ్ లో ఉన్నాడు.

మురుగదాస్ సినిమా పూర్తి చేసుకుంటే మహేష్, సక్సెస్ ఫుల్ గా 23 సినిమాలు పూర్తి చేసుకున్నట్టే. ఇక కొరటాల శివతో చేయబోతున్న 24 వ సినిమాను కాసేపు పక్కనపెడితే, 25వ సినిమా ఎలా ప్లాన్ చేయబోతున్నాడా అన్న ఆలోచన ఇప్పటికే ఫ్యాన్స్ లో స్టార్ట్ అయిపోయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆ స్పెషల్ మూవీ సిద్ధమౌతోంది.

వెంకీ కూడా గురు సినిమా తరవాత ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో 74 సినిమాలు పూర్తి చేసుకోనున్న విక్టరీ, 75వ సినిమాని సమ్ థింగ్ స్పెషల్ గా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నాడు. వెంకీ చేయబోయే ప్రతిష్టాత్మక 75వ సినిమా కచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్ టైనరే. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే వస్తుందనే విషయాన్ని కూడా కచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ 75వ సినిమాను డైరక్ట్ చేసేది ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు.  ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమా కంప్లీట్ అయ్యేలోపు తన స్పెషల్ మూవీపై ఓ డెసిషన్ తీసుకుంటాడు వెంకీ.