ఫిట్ & హ్యాండ్సమ్: న్యూ లుక్ లో మెగాస్టార్

Monday,July 22,2019 - 02:45 by Z_CLU

చిరంజీవి గెటప్ మారిపోయింది. మొన్నటివరకు సైరా నరసింహారెడ్డి సినిమా కోసం గడ్డం పెంచి, కాస్త భారీగా కనిపించిన మెగాస్టార్ ఇప్పుడు ఫిట్ గా, ఇంకాస్త హ్యాండ్సమ్ గా తయారయ్యారు. దీనికోసం దాదాపు 2 వారాలు కష్టపడ్డారు చిరు. ఇంతకీ ఈ మేకోవర్ ఎందుకో తెలుసా?

కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం చిరంజీవి ఇలా ఫిట్ గా తయారయ్యారు. ప్రస్తుతానికైతే చిరంజీవి లుక్ కు సంబంధించి ఎలాంటి స్టిల్స్ బయటకు రాలేదు. వచ్చేనెలలో ఈ సినిమా లాంఛ్ అవుతుంది. అప్పటివరకు చిరు గెటప్ ను సీక్రెట్ గా ఉంచుతారేమో.

నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.

సినిమాకు సంబంధించి కొరటాల ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. అటు చిరంజీవి కూడా కంప్లీట్ నెరేషన్ విని ఓకే చెప్పేశారు. హీరోయిన్ ఫిక్స్ అయినా, అవ్వకపోయినా.. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లాలని అంతా ఓ మాట అనుకున్నారు. ఓవైపు కొరటాల సినిమాలో నటిస్తూనే, మరోవైపు సైరా ప్రమోషన్స్ ప్రారంభించబోతున్నారు చిరంజీవి.