సాహో ఫస్ట్ టాక్ వచ్చేది అక్కడ్నుంచే!

Wednesday,August 28,2019 - 03:06 by Z_CLU

సినిమా రిలీజైన వెంటనే టాక్ ఎలా ఉందో కనుక్కోవడం కామన్. రీజనల్ సినిమాకు టాక్ కనుక్కోవడం చాలా సులభం. మొదటి షో ఎక్కడ పడుతుందో తెలిసిపోతుంది. కానీ సాహో లాంటి పాన్-ఇండియా మూవీ విషయంలో ఇది కష్టం. ఇంతకీ సాహో మొట్టమొదటి షో ఎక్కడ పడుతుందో తెలుసా?

సాహో సినిమాకు సంబంధించి మొదటి షో దుబాయ్ లో పడబోతోంది. దుబాయ్ టైమ్ ప్రకారం, రేపు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు 4 ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో సాహోను ప్రదర్శించబోతున్నారు. దీంతోపాటు అదే సమయానికి షార్జాలో కూడా ఓ షో పడబోతోంది. సో.. ఫస్ట్ రిపోర్ట్ అక్కడ్నుంచే రాబోతోంది.

దుబాయ్ లో షో ప్రారంభమైన కొద్దిసేపటికే ఇండియాలో కూడా సాహో షోలు స్టార్ట్ అవుతాయి. భీమవరంలో ఈ సినిమాను 30వ తేదీ ఉదయం 5 గంటలకే ప్రదర్శించబోతున్నారు. ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకే షోలు పడబోతున్నాయి.

ఈమధ్య కాలంలో ఎన్నడూ చూడని విధంగా సాహో అడ్వాన్స్ బుకింక్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో శుక్ర-శని-ఆది వారాలకు సంబంధించి అన్ని షోలు హౌజ్ ఫుల్ అయిపోయాయి. అటు ఓవర్సీస్ లో మాత్రం టిక్కెట్ రేట్లు పెంపు కారణంగా అడ్వాన్స్ బుకింగ్ కాస్త స్లోగా నడుస్తోంది. హౌజ్ ఫుల్స్ మాత్రం గ్యారెంటీ.

ఓవర్సీస్ లో ఏకంగా 600 లొకేషన్లలో 1100కు పైగా స్క్రీన్స్ పై సాహోను రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి-2 కంటే ఇది బిగ్గెస్ట్ స్క్రీన్ కౌంట్. ప్రస్తుతం దేశం మొత్తం సాహో మేనియా నడుస్తోంది.