వ్యాలెంటైన్స్ డే కి నాని ఇస్తున్న గిఫ్ట్..?

Tuesday,February 05,2019 - 07:56 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది నాని ‘జెర్సీ’. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. ఈ టీజర్ లో ఎక్కడా సినిమాలో క్యారెక్టర్స్ ని రివీల్ చేయకుండా సస్పెన్స్ క్రియేట్ చేసిన మేకర్స్, వ్యాలెంటైన్స్ డే కానుకగా సినిమాలోని సాంగ్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి లేదు కానీ, సినిమాలో మొత్తం 8 సాంగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాటిలోంచి సినిమాలో ఉండబోయే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజర్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 19 ఈ సినిమా రిలీజ్ డేట్.