నాని ‘జెర్సీ’ నుండి ఫస్ట్ సింగిల్

Monday,February 11,2019 - 05:11 by Z_CLU

క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది నాని ‘జెర్సీ’. అయితే ఈ సినిమాలో జస్ట్ క్రికెట్ ఒకటే కాదు, ఇంట్రెస్టింగ్ లవ్ యాంగిల్ కూడా ఉండబోతుంది. శ్రద్ధా శ్రీనాథ్ నానికి జోడీగా నటిస్తుంది ఈ సినిమాలో. అయితే ఈ వ్యాలెంటైన్స్ కి సినిమాలో సందర్భానుసారంగా ఉండబోయే ‘అదేంటోగాని ఉన్నపాటుగా…’ అంటూ సాగే లవ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు ఈ సినిమాకి. అందుకే ఈ సినిమాతో పాటు సాంగ్స్ పై కూడా ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఫ్యాన్స్ లో వైడ్ రేంజ్ లో రీచ్ అయింది. ఈ ఫస్ట్ సింగిల్ కూడా అదే స్థాయిలో ఇంప్రెస్ చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇవాళ్టితో  సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది జెర్సీ టీమ్.

నటీనటులు 

నాచురల్ స్టార్  “నాని” ,శ్రద్దా  శ్రీనాద్,సత్యరాజ్,బ్రహ్మాజీ,రోనిత్ కామ్రా . 

 

సాంకేతిక వర్గం:

మ్యూజిక్:అనిరుద్ 

కెమెరామాన్ :సాను వర్గీస్ 

ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా

ఎడిటర్ :నవీన్ నూలి

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్ 

ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి

కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి