మరికొన్ని గంటల్లో జంబలకిడిపంబ ఫస్ట్ సింగిల్

Friday,May 18,2018 - 10:35 by Z_CLU

`జంబ‌ల‌కిడి పంబ‌` అనే పేరు విన‌గానే సీనియ‌ర్ న‌రేశ్ హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ చేసిన న‌వ్వుల సంద‌డి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో మ‌రో హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ రెడీ అవుతోంది. గీతాంజ‌లి, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా, ఆనందో బ్రహ్మ వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో హీరోగా మెప్పించిన శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నారు.

సూపర్ హిట్ మ్యూజిక్ డైరక్టర్ గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించడం హైలెట్. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, నిన్ను కోరి, ప్రేమమ్, మజ్ను, ఊపిరి, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించాడు గోపీసుందర్. ఇప్పుడు జంబలకిడిపంబ సినిమాకు కూడా అదే రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు. అలా పాటలతోనే ఈ సినిమాకు డబుల్ క్రేజ్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మేకర్స్

ఈ సినిమాతో సిద్ధి ఇద్నానీ హీరోయిన్ గా పరిచయమౌతోంది. పోసాని, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు మను దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చేనెల 14న వరల్డ్ వైడ్ విడుదలకానుంది జంబలకిడి పంబ.