మాస్ రాజా నుంచి మరో ఫస్ట్ లుక్

Monday,September 24,2018 - 11:11 by Z_CLU

రవితేజ నటిస్తున్న అమర్-అక్బర్-ఆంటోనీ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. దానికి కొనసాగింపుగా ఈరోజు మరో వీడియో రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో టైటిల్ లోగోతో పాటు రవితేజ గెటప్స్ పై చిన్నపాటి క్లారిటీ ఇచ్చిన యూనిట్, రవితేజను మోస్ట్ ఎగ్రెసివ్ గా చూపిస్తూ తాజా వీడియో విడుదల చేసింది. శ్రీనువైట్ల పుట్టినరోజు కానుకగా విడుదలైంది ఈ వీడియో

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ సినిమాలో రవితేజ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. మాస్ రాజా త్రిపాత్రాభినయం చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే. అంతేకాదు, ఈ మూవీలో మరో స్పెషాలిటీ కూడా ఉంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ కు వస్తోంది ఇలియానా. అంతేకాదు, ఇదే సినిమాతో చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకొస్తోంది లయ.

సునీల్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 5న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.