Thimmarusu - ఫస్ట్ లుక్ రిలీజ్

Saturday,December 05,2020 - 04:16 by Z_CLU

వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటోన్న సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్.

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై శ్రుజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

Satyadev_Thimmarusu_First_look-zeecinemalu

ఈరోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. డిసెంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ను ఏకథాటిగా చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తయింది. జనవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: సత్యదేవ్‌, ప్రియాంకా జవాల్కర్, బ్రహ్మాజీ, రవిబాబు, అజయ్‌, ప్రవీణ్‌, ఝాన్సీ, వైవా హర్ష తదితరులు

టెక్నీషియన్స్:
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
బ్యానర్ : ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్‌
ఎడిటింగ్ : తమ్మిరాజు