RRR ఫస్ట్ లుక్ ఈరోజే

Tuesday,October 22,2019 - 12:38 by Z_CLU

అన్నీ అనుకున్నట్టు జరిగితే మరికొన్ని గంటల్లో ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ వస్తుంది. ఇదే కనుక జరిగితే RRR ప్రాజెక్ట్ కు సంబంధించి ఇదే ఫస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ అవుతుంది. ఇంతకీ ఈరోజే RRR ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి?

RRRలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలున్నాయి. ఈరోజు కొమరం భీమ్ జయంతి. 1901లో తెలంగాణలోని అసిఫాబాద్ లో ఇదే రోజు కొమరం భీమ్ జన్మించారు. అందుకే ఈరోజు RRR సినిమాలో యంగ్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ లుక్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

RRR సినిమాకు సంబంధించి ఇప్పట్లో ఫస్ట్ లుక్స్ రావని అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది జులై రిలీజ్ కు రెడీ చేశారు. కాబట్టి ఇంత త్వరగా ఫస్ట్ లుక్స్ రావని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈరోజు RRR నుంచి కొమరం భీమ్ లుక్ లో ఉన్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది.