ఇతడే గ్యాంగ్ లీడర్.. ఆ గ్యాంగ్ ఇదే!

Monday,July 15,2019 - 06:18 by Z_CLU

నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’. కొద్దిసేపటి కిందట సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను..అంటూ అయిదు పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని నాని విడుదల చేశారు. పోస్టర్ లో అయిదుగురు భిన్న వయస్కులైన ఆడవారితో కలిసి బైనాక్యూలర్స్ పట్టుకుని ఉన్న నాని తో ఆకట్టుకునేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ తో ఈ గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లో ఉన్నదెవరో రివీల్ చేశారు.

ఈ ఐదుగురికి గ్యాంగ్ లీడర్ గా నాని ఇందులో కనిపించబోతున్నాడు. ఇక ఫస్ట్ సాంగ్ ని జులై 18 న, టీజర్ ని జులై 24 న రిలీజ్ చేయనున్నారు. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ తో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ ను ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30 న విడుదల చేస్తారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.