కీర్తి సురేష్ నుంచి మరో మూవీ

Tuesday,May 02,2017 - 11:00 by Z_CLU

తెలుగులో వరుసగా 2 హిట్స్ అందుకుంది కీర్తిసురేష్. నేను శైలజ సినిమాతో హిట్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, నేను లోకల్ సినిమాతో మరో గ్రాండ్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. దీంతో కీర్తి పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కొందరు నిర్మాతలు సిద్ధమౌతున్నారు. కీర్తి సురేష్ తమిళ్ లో నటించిన సినిమాల్ని వరుసగా తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వస్తున్న మూవీ విజయ భైరవ.

పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంపై విజయ్‌, కీర్తి సురేష్‌, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్‌ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘విజయ భైరవ’. ఈ చిత్రం తొలి కాపీ రెడీ అయ్యింది. ఈనెల చివరి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘తమిళ్‌లో సంచలన విజయం సాధించిన ‘భైరవ’ చిత్రాన్ని ‘విజయ భైరవ’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశారు. ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌, కీర్తిసురేష్‌ల నటన అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే జగపతిబాబుగారి నటన ఈ సినిమాకే హైలైట్‌. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటల్ని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు.