"రొమాంటిక్" మూవీ సెట్స్ లో అగ్నిప్రమాదం

Tuesday,October 15,2019 - 12:29 by Z_CLU

ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమా సెట్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదు. సెట్ కూడా పూర్తిగా కాలిపోలేదు. వెంటనే అలెర్ట్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షూటింగ్ మాత్రం పోస్ట్ పోన్ అయింది.

హీరో ఆకాష్ పూరి, హీరోయిన్ కేతిక శర్మ మధ్య తీస్తున్న ఓ సాంగ్ షూటింగ్ కోసం భారీ సెట్ వేశారు. అనుకోకుండా సెట్స్ లో వేసిన డెకరేటివ్ కర్టెన్లకు నిప్పు అంటుంది. వెంటనే ఎలర్ట్ అయిన యూనిట్ సభ్యులు మంటల్ని ఆర్పేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

పూరి, చార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో అనీల్ పాడూరి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. పూరి జగన్నాధ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం సాంగ్స్ చిత్రీకరణ సాగుతోంది.