సలోనీకి మరో సినిమా దొరికిందోచ్

Sunday,September 01,2019 - 10:45 by Z_CLU

2005 నుంచి ఇండస్ట్రీలో ఉంది. కానీ పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. మర్యాదరామన్నతో బౌన్స్ బ్యాక్ అవుతుందనుకున్న టైమ్ లో మళ్లీ కెరీర్ గాడి తప్పింది. అలా ఫేడ్ అవుట్ అయిపోతున్న సలోనీ ఎట్టకేలకు మరో మూవీ ఛాన్స్ దక్కించుకుంది.

మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ అనూప్ సింగ్ ఠాగూర్ టైటిల్ పాత్రలో “మిస్టర్ రావణ” అనే చిత్రం తెరమీదకు వస్తొంది. తెలుగు ,తమిళ కన్నడ, హిందీ భాషల్లొ తీసే ఈ సినిమా ముంబై లోని ప్రసిద్ద శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ లో ప్రారంభమైంది. ‌కుందన ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయింది సలోనీ.

తెలుగులో ఆమె చేసిన చివరి చిత్రం మీలో ఎవరు కోటీశ్వరుడు. రెండేళ్ల కిందట వచ్చిన ఆ సినిమా ఫ్లాప్ తర్వాత మళ్లీ కనిపించలేదు సలోనీ. ఇప్పుడీ కొత్త సినిమాతో మరోసారి కెమెరా ముందుకురాబోతోంది.