Bimbisara పాన్ ఇండియా రిలీజ్ పై కళ్యాణ్ రామ్ క్లారిటీ !

Tuesday,August 02,2022 - 06:33 by Z_CLU

I have a plan for Bimbisara Pan India release says Kalyan Ram

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వసిష్ఠ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్ బేనర్ పై హరి నిర్మిస్తున్న ‘బింబిసార’ ఆగస్ట్ 5న గ్రాండ్ గా రిలీజవుతుంది.  ఈ సినిమాను ముందు నుండి కేవలం తెలుగులోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇతర భాషలకు సంబంధించి డబ్బింగ్ వర్క్ చేయలేదు. దీంతో వరల్డ్ వైడ్ గా తెలుగు భాషలోనే సినిమా రిలీజ్ కానుంది. తాజాగా టీం కి ఓ ఇంటర్వ్యూలో ఇది పాన్ ఇండియా స్కేల్ ఉన్న సినిమా కదా మరి ఎందుకు మిగతా భాషల్లో రిలీజ్ చెయ్యట్లేదు ? అనే ప్రశ్న ఎదురైంది.

దానికి హీరో కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ” ప్రస్తుతానికి తెలుగులోనే రిలీజ్ అనుకున్నాం. మన తెలుగు ప్రేక్షకులు మేము ఊహించినట్టే సినిమాను పెద్ద హిట్ చేస్తే తప్పకుండా ఇదే నెల 18 న అంటే రెండు వారాల్లో మిగతా భాషల్లో కూడా డబ్ చేసి పాన్ ఇండియా రిలీజ్ చేస్తాం. ఆ ప్లాన్ అయితే ఉంది. సో సినిమా విజయాన్ని బట్టి వెంటనే ఆ డిసిషన్ తీసుకుంటాం అంటూ సమాధానమిచ్చారు.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ , ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా చూసొచ్చి ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ ‘బింబిసార’ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసింది.  బుకింగ్స్ కూడా జోరుగా  జరుగుతున్నాయి. ఈ మధ్య అన్ని సినిమాలు సాదా సీదా ఓపెనింగ్స్ తెచ్చుకుంటున్న తరుణంలో ‘బింబిసార’ మాత్రం బెస్ట్ ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు  అంచనా వేస్తున్నారు. టైం ట్రావెల్ కథతో సోషియో ఫాంటసీ గా తెరకెక్కిన ఈ సినిమాలో కేథరిన్ , సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించారు.  ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించారు.’

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics