Indian 2 - మళ్లీ మొదలైన కమల్-శంకర్ మూవీ

Wednesday,August 24,2022 - 03:42 by Z_CLU

Finally Indian 2 Fresh Schedule starts

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. శంకర్ దర్శకత్వంలో ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ఈ సందర్భంగా మరో బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల చేశారు.

సూపర్ హిట్టయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 ను తెరకెక్కిస్తున్నారు. రెండేళ్ల కిందటే షూటింగ్ మొదలైంది. అయితే అంతలోనే కరోనా రావడం, క్రేన్ కూలి సిబ్బంది మరణించడం లాంటి ఘటనల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత శంకర్ కు, లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలకు మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి.

దీంతో షూటింగ్స్ పై డౌట్స్ మొదలయ్యాయి. మొత్తానికి అన్ని సమస్యలు కొలిక్కి రావడంతో, ఇండియన్ 2 సినిమాను మళ్లీ మొదలుపెట్టేందుకు శంకర్ అంగీకరించాడు.

ఈ సినిమా కోసం చెన్నై శివార్లలో భారీ సెట్ వేశారు. ఇవాళ్టి నుంచి ఆ సెట్స్ లోనే షూటింగ్ మొదలైంది. కాజల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఆమె కూడా సెట్స్ పైకి వస్తుంది. పెళ్లి, పిల్లల వల్ల గ్యాప్ తీసుకున్న కాజల్ కు ఇది రీఎంట్రీ మూవీ కాబోతోంది. సిద్దార్థ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.