అంతా రెడీ – హీరో కోసమే వెయిటింగ్

Tuesday,May 21,2019 - 11:02 by Z_CLU

యాక్షన్ ఒక్కటే బ్యాలన్స్… హీరోల ఇమేజ్ దగ్గరి నుండి ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ వరకు ప్రతీది మైండ్ లో పెట్టుకుని బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని హీరోల కోసం వెయిట్ చేస్తున్నారు దర్శకులు. స్టార్ హీరోస్ అంతకు ముందే కమిట్ అయిన సినిమాలు ఈ ఎదురుచూపులకు రీజన్ అయితే, ఒక్కోసారి డిఫెరెంట్ రీజన్స్ వల్ల సినిమాని సెట్స్ పైకి తీసుకురాలేకపోతున్నారు. కృష్ణవంశీ విషయంలో అయితే సెకండ్ రీజన్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

కృష్ణవంశీ: బాలయ్య ఇంప్రెస్ అయ్యే స్థాయి కథ రాసుకున్నాడు కృష్ణవంశీ. ‘ఇంక ఆలస్యమే లేదు, రేపో మాపో సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుంది’… అన్నంత ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ సినిమా పనులు కూడా నడిచాయి. సినిమాలోని ఓ కీ రోల్ కోసం బిగ్ బి ని కూడా సంప్రదించారు.  ఆ తరవాతే సడెన్ గా సినిమా డ్రాప్ అయింది. ఇప్పటికీ బాలయ్య ఎప్పుడెప్పుడు సిగ్నల్ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నాడు కృష్ణవంశీ.

కొరటాల – మెగాస్టార్ తో సినిమా చేశాక కానీ ఇంకో సినిమా గురించి ఆలోచించలేడు కొరటాల. ‘భరత్ అనే నేను’ తరవాత మెగాస్టార్ కి కథ చెప్పి ఒప్పించాడు. ఈ గ్యాప్ లో మళ్ళీ మెగాఫోన్ పట్టుకోలేదు. ‘సైరా’ కి టైమ్ పడుతుందని తెలిసినా మరో ప్రాజెక్టును షిఫ్ట్ అవ్వలేదు. ఎదురుచూస్తున్నాడు.

వేణు శ్రీరామ్ –మొన్నటికి మొన్న అల్లు అర్జున్ బర్త్ డే రోజు అనౌన్స్ అయింది ఈ సినిమా. కనీసం విషయం కూడా బయటికి రాకుండా సైలెంట్ గా కథ చెప్పి కన్విన్స్ చేసుకున్నాడు వేణు శ్రీరామ్. ఇంకా 2 సినిమాల తరవాత కానీ బన్ని డేట్స్ ఇవ్వలేడన్న క్లారిటీ ఈ దర్శకుడికి బిగినింగ్ నుండే ఉంది. ఇప్పుడు త్రివిక్రమ్, తరవాత సుకుమార్.. ఆ తరవాత కానీ వేణు శ్రీరామ్ వంతు రాదు… అయినా సరే వెయిట్ చేస్తున్నాడు.

కళ్యాణ్ కృష్ణ : ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సక్సెస్ అయినా, సినిమాలోని బంగార్రాజును అంత ఈజీగా వదులుకోలేదు కళ్యాణ్ కృష్ణ. దాదాపు రెండేళ్లుగా ఈ క్యారెక్టర్ చుట్టే కథను అల్లుకుంటున్నాడు. ఇపుడు నాగ్ ‘మన్మధుడు 2’ తో బిజీగా ఉన్నాడు కాబట్టి, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా ‘బంగార్రాజు’ ను సెట్స్ పైకి తేవాలని వెయిట్ చేస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ.