ఒక్క సినిమా... జస్ట్ ఒకే ఒక్క సినిమా...

Wednesday,March 20,2019 - 01:01 by Z_CLU

ఓ సినిమా ఆవరేజ్ అయితే నెక్స్ట్ గట్టిగా కొట్టాలనే కసి బిగిన్ అవుతుంది. అదే అంచనాలు మించి సక్సెస్ అయితే, ఆ క్రేజ్ ని ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ స్టార్ అయితేనేం, ఫిల్మ్ మేకర్ అయితేనేం, వారికి సంబంధించి ఏ మూలనుండి ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా, ఇమ్మీడియట్ గా ఫోకస్ లోకి వచ్చేస్తారు. అందుకే ఓ ఇద్దరు సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్స్ ఈ ప్రెజర్ నుండి తప్పించుకోవడానికి మంచి ప్లాన్ వేసుకున్నారు.

సందీప్ రెడ్డి వంగ, అజయ్ భూపతి…. ఇద్దరూ చేసింది జస్ట్ ఒక్కొక్క సినిమానే.  అర్జున్ రెడ్డి, RX100… ఈ 2 సినిమాలకు ముందు వీళ్ళెవరో కూడా తెలీదు. కానీ ఈ 2 సినిమాల సక్సెస్ ఒక్కసారిగా వీరిద్దరినీ లైమ్ లైట్ లోకి తీసుకు వచ్చేసింది. ఇదంతా పాత కహానీ అనుకోండి. కాకపోతే ఇప్పుడు ముందున్న పాయింట్ ఏంటంటే, ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఇమ్మీడియట్ గా ఇంకో సినిమా రావాలి కదా ఏదీ..?

‘అర్జున్ రెడ్డి’ తరవాత న్యాచురల్ గానే సందీప్ రెడ్డి వంగ నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని వెయిట్ చేశారు ఫ్యాన్స్. మళ్ళీ అలాంటి కల్ట్ మాస్ కంటెంట్ తో సినిమా చేస్తాడా..? లేకపోతే ఈసారి ఇంకో జోనర్ ని ఎంచుకుంటాడా..? చాలా రోజులు తర్జన భర్జన నడిచింది. ఇవన్నీ కాదని సింపుల్ గా అదే సినిమాని బాలీవుడ్ లో ప్లాన్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అక్కడ అదే ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని వెళ్ళాడా..? లేకపోతే ఇక్కడ అర్జున్ రెడ్డి హీట్ తగ్గాకే స్టార్ట్ అవ్వడం బెటర్ అనుకున్నాడా..? తెలీదు కానీ చేసింది మాత్రం అదే…

ఇక అజయ్ భూపతిది కూడా సేమ్ స్టోరీ. కానీ ఈ దర్శకుడు బాలీవుడ్ కాకుండా కోలీవుడ్ కి ఫిక్సయ్యాడు. ఆది పినిశెట్టి తో RX100 రీమేక్ చేస్తున్నాడు. అక్కడి నుండి కొడుతున్న వైబ్స్ చూస్తుంటే, సినిమా అక్కడ ఇంకా పెద్ద హిట్టయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తరవాత ఏంటనేది రిలీజ్ తరవాతే తెలుస్తుంది. అప్పటి వరకు ఈ క్రేజీ డైరెక్టర్స్ ఎప్పుడు రిటర్న్ అవుతారా అని వెయిట్ చేస్తూండాల్సిందే .