ఇంప్రెస్ చేస్తున్న 'ఫిదా' టీజర్

Saturday,June 17,2017 - 04:24 by Z_CLU

వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటింగ్ లవ్ ఎంటర్టైనర్ ‘ఫిదా’ టీజర్ రిలీజయ్యింది. ఇప్పటికే మోషన్ పోస్టర్, పోస్టర్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా లేటెస్ట్ గా టీజర్ తో అందరినీ ఇంప్రెస్స్ చేస్తూ సినిమా పై అంచనాలను పెంచేసింది.తాజాగా ఈ సినిమా టీజర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు మేకర్స్.

ముఖ్యంగా టీజర్ లో తెలంగాణ యాస తో సాయి పల్లవి చెప్పిన డైలాగ్, ఏం పిల్లరా.. ఎల్లట్లేదు మైండ్ లో నుంచి అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. దాదాపు 30 సెకన్ల నిడివి తో ఉన్న ఈ టీజర్ లో అందరినీ ఆకట్టుకుంటున్నారు వరుణ్-సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శక్తి కాంత్ సంగీతం అందిస్తున్నాడు.