మిలియన్ వ్యూస్ ని దాటేసిన ఫిదా టీజర్

Sunday,June 18,2017 - 10:30 by Z_CLU

నిన్న సాయంత్రం రిలీజైన వరుణ్ తేజ్ ‘ఫిదా’ టీజర్ కి  ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఫ్యాన్స్ లో ఏ రేంజ్ లో డిమాండ్ క్రియేట్ చేసిందో, టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తుంది. కనీసం 24 గంటలు కూడా గడవకముందే ఏకంగా మిలియన్ వ్యూస్ దాటేసిందంటే సినిమా ఫ్యూచర్ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.

 

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. డిఫెరెంట్ సినిమాలతో ఆల్ రెడీ క్రేజ్ క్రియేట్ వరుణ్ తేజ్ ఎ సినిమాకి పెద్ద ఎసెట్ అయితే, సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిలా ఎట్రాక్ట్ చేయడం, సినిమాపై  నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకి శక్తికాంత్ మ్యూజిక్ కంపోజర్.