4 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఫిదా ట్రేలర్

Tuesday,June 27,2017 - 12:20 by Z_CLU

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ‘ఫిదా’ టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.  అల్టిమేట్ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఫిదా ట్రేలర్ ఇప్పటికే 4 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

వరుణ్ తేజ్ స్టైలిష్ NRI లా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిలా నటించడం సినిమాకి పెద్ద ఎట్రాక్టివ్ పాయింట్ లా మారింది. ట్రేలర్ లో అక్కడక్కడా ఉన్న డైలాగ్స్ ని బట్టి  ఫిదా, రీసెంట్ గా రిలీజైన సినిమాలతో పోలిస్తే డిఫెరెంట్ గా ఉండటం గ్యారంటీ అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్.