సమ్మర్ సందడి ఇంకా మిగిలే ఉంది

Saturday,May 18,2019 - 02:02 by Z_CLU

వరసగా స్పెషల్ గా సమ్మర్ కోసమే లైనప్ అయిన సినిమాలు రిలీజయిపోయాయి. మజిలీ, జెర్సీ… వీటి తరవాత రీసెంట్ గా మహేష్ బాబు ‘మహర్షి’ కూడా రిలీజయ్యేసరికి ఆల్మోస్ట్ సమ్మర్ సందడి ముగిసిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ నిజానికి ఈ హడావిడి ఇంకా తగ్గలేదు. ఇంకా వరసగా 6 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. చిన్న సినిమాలైనప్పటికీ ఓ మోస్తరు అంచనాలతో వస్తున్నాయి…

 

సీత :  ఈ నెల 24 న రిలీజవుతుంది. తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలతో మాస్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో డిఫెరెంట్ షెడ్ లో కనిపించబోతున్నాడు. కాజల్ కూడా
అంతే. రెగ్యులర్ హీరోయిన్ కి కంప్లీట్ గా డిఫెరెంట్ క్యారెక్ట రైజేషన్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు తేజ ఈ పంచదార బొమ్మని…

NGK– సూర్య సినిమా నందగోపాలకృష్ణ కూడా సమ్మర్ లోనే వస్తుంది. మే 31 రిలీజ్ డేట్. స్ట్రేట్ తెలుగు సినిమా కాకపోయినా, సూర్య కి టాలీవుడ్ లో కూడా భారీ మైలేజ్ ఉంది. కాబట్టి ఇది కూడా ఆడియెన్స్ ఎదురు చూస్తున్న సినిమానే.

అభినేత్రి 2 : కావాల్సినంత కామెడీ.. జెన్యూన్ అనిపించే స్థాయి హారర్ ఎలిమెంట్స్.. గతంలో రిలీజైన అభినేత్రికి దక్కిన అప్లాజ్ అదే. అందుకే ఇప్పుడు అబినేత్రి 2 అనగానే ఈ సినిమాపై ఆ స్థాయి అంచనాలే సెట్ అయి ఉన్నాయి… మే 31 న రిలీజవుతుందీ సినిమా.

అర్జున్ సురవరం – ఓ 2 సార్లు రిలీజ్ డేట్ మారేసరికి ఈ సారి పక్కా ప్లాన్డ్ గా ఫిక్సయ్యాకే అనౌన్స్ చేద్దామని చూస్తున్నారు మేకర్స్. సూచనలైతే మ్యాగ్జిమం జూన్ ఫస్ట్ వీక్ కే రిలీజయ్యేలా ఉన్నాయి. నిఖిల్ సినిమా రిలీజయిందంటే ఏ మాత్రం డిజప్పాయింట్ చేయదు అనే ఫీలింగ్ ఆడియెన్స్ లొ  ఉంది…


హిప్పీ : RX 100 తరవాత రిలీజవుతున్న కార్తికేయ సినిమా ఇది. ఈ ఒక్క రీజన్ చాలు. ఈ సినిమాకి ఆడియెన్స్ లో ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవడానికి… జూన్ 7 న రిలీజవుతుంది ఈ సినిమా.

బ్రోచేవారెవరురా : శ్రీవిష్ణు, నివేత థామస్, సత్యదేవ్, నివేత పెతురాజ్… ప్రియదర్శి కల్సి నటించిన సినిమా ఇది. రీసెంట్ గా రిలీజైన టీజర్ ఈ సినిమాపై క్యూరియాసిటీ ని 100% క్రియేట్ చేసిందనే చెప్పాలి. మ్యాగ్జిమం జూన్ ఎండింగ్ లో ఈ సినిమా రిలీజయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.