సందడి ఇంకా కొనసాగుతోంది

Friday,October 14,2016 - 12:22 by Z_CLU

భారీ కాంపిటీషన్ అవుతుందేమో అన్న ఆలోచన కూడా లేకుండా వరస సినిమాలతో గ్రాండ్ గా గడిచిపోయింది దసరా. అందుకే గడిచిపోయిన దసరాకి సీక్వెల్ గా దసరా పార్ట్-2 కూడా సిద్ధమవుతుంది. అంటే సినిమా పండగకి సీక్వెల్ అన్నమాట. దసరా సీజన్ గడిచిపోయినా సినిమా సీజన్ లో ఏ మాత్రం జోష్ తగ్గలేదు. వరస సినిమాలతో టాలీవుడ్ లో పండగ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ism
దసరా సీజన్ ని ప్లాట్ ఫాం గా చేసుకుని రిలీజైన అభినేత్రి, ఈడు గోల్డె హే, ప్రేమమ్, మన ఊరి రామాయణం లాంటి సినిమాలు, ఏ మాత్రం కాంపిటీషన్ కి జంకకుండా వరసగా అలరించాయి. ఈ వేడిని కొనసాగిస్తూ… హై ఎండ్ టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన “నాగభరణం” అపుడే థియేటర్ లో రంగ ప్రవేశం చేసేసింది. ఇక కళ్యాణ్ రాం ‘ఇజం’ సెన్సార్ పూర్తి చేసుకుని అక్టోబర్ 21 న రికార్డులు ఇరగదీయడానికా అన్నట్టు రెడీగా ఉంది.
karthi_2975677f
తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న కార్తి ‘కాష్మోరా’ గ్రాఫికల్ ఫిక్షన్ ఇప్పటికే భారీ అంచనాల మధ్య అక్టోబర్ 28న బరిలో దిగడానికి సిద్ధంగా ఉంటే,  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాగ చైతన్య “సాహసం శ్వాసగా సాగిపో” కూడా అక్టోబర్ నెలలోనే సర్ ప్రైజింగ్ రిలీజ్ తో అదరగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బ్యాక్ టు బ్యాక్ సినిమాల స్పీడ్ చూస్తుంటే ఈ సందడి ఇప్పట్లో ఆగేలా లేదనిపిస్తుంది.